‘హలో, ఏవండీ’
తలుపు చప్పుడు కి ఉలిక్కి పడి లేచాను. టైం చూస్తే మధ్యాన్నం రెండు కావస్తోంది. శనివారం కావడం తో నాకు సెలవు. మా ఆవిడ ఆఫీసుకి వెళ్ళింది. నేను అంతకు ముందే భోంచేసి కాస్త నడుం వాల్చాను. ఇంతలోనే ఎవరో వచ్చారు. విసుక్కుంటూ తలుపు తీశాను. ఎదురుగా ఒక అమ్మాయి. పాతిక లోపే ఉంటుంది వయసు. చుడీ దార్ వేసుకుని, చేతిలో ఏదో పుస్తకం, చంకలో ఒక బ్యాగ్ ఉంది.
‘నమస్తే సార్, ఒక్క పడి నిముషాలు మాట్లాడొచ్చా?’ అంది. ఎవరో సేల్స్ గర్ల్ అనుకుంటా. నేను కళ్ళు నలుపుకుంటూ, ‘ఈ టైం లో ఏం అమ్మడానికి వచ్చావు?’ అన్నాను విసుగ్గా. ‘అమ్మేదేమీ లేదు సార్. ఓన్లీ డెమో. అంతే, మీకు నచ్చితేనే కొనండి. డెమో మాత్రం ఫ్రీ’ అంది. ‘ఎలానూ కొనను కాబట్టి డెమో ఎందుకు, నీ టైం నా టైం వేస్ట్’ అన్నాను. ‘ప్లీజ్ సార్, డెమో చేస్తే నాకు కొన్ని పాయింట్లు వస్తాయి. మీరు కొనక పోయినా డెమో చూడండి, ప్లీజ్’, అంది వేడుకోలుగా. అసలే నిద్ర చెడి చిరాగ్గా ఉంది. మళ్ళీ అరగంట ఈ సుత్తి. ‘వద్దు లే, మళ్ళీ తరువాత రా’ అన్నాను. ‘సార్ సార్, ప్లీజ్. ఈ రోజు ఇంతవరకూ ఒక్క కాల్ కూడా క్లిక్ కాలేదు. మీ ఇంట్లో తప్పక అవుతుందన్న ఆశతో వచ్చాను, ప్లీజ్ సార్’ అంది. ఇక కాదనలేక పోయాను. తలుపు మొత్తం తీసి, ‘సరే రా. కానీ త్వరగా పూర్తీ చెయ్యి, నేను ఎత్లానూ కొనను, ముందే చెబుతున్నాను’ అన్నాను, లోపలి నడుస్తూ.